డాలస్‌లో ఘనంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-16 14:58:10.0  )
డాలస్‌లో ఘనంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: డాలస్ (Dallas), టెక్సస్ డాలస్‌ (Texas Dallas)లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు ఆగస్ట్ 15న భారతదేశ78వ స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. వారాంతం కాకపోయినప్పటికీ భారతీయులు అత్యధిక సంఖ్యలో హాజరుకావడం హాజరయ్యారు. వారందరికీ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ (Mahatma Gandhi Memorial of North Texas) కార్యదర్శి రావు కల్వాల (Rao Kalval)స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర(Dr.Prasad Thotakoora)కు, సహకరించిన అధికారులకు భారతీయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమన్నారు. స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని ఆనందం వ్యక్తం చేశారు. దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు, గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయలు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కళ్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. ఈ సందర్భంగా భారత దేశ సాతంత్ర్య సమరయోధులకు, దేశ నాయకులకు ఘనంగా నివాళి అర్పించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story