- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. గతంలో టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశం ఉండేది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. దీంతో ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. టెన్త్ సిలబస్ ఆధారంగానే ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 28వ తేదీన పరీక్షను నిర్వహించి.. డిసెంబర్ 5వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో కూడా 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.