ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నార్త్ కొరియా

by Shiva |
ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నార్త్ కొరియా
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలంపిక్స్ 2020 నుంచి తాము వైదొలగుతున్నట్లు నార్త్ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశానికి చెందిన అథ్లెట్లను జులై నుంచి ప్రారంభమయ్యే ఒలంపిక్స్‌కు పంపించడం లేదని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిపోతుండటంతో పాటు, సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కంటే తమకు ఏదీ ప్రాధాన్యత కాదని స్పష్టం చేసింది.

మార్చి 25న జరిగిన నార్త్ కొరియా నేషనల్ ఒలంపిక్ కమిటీ సమవేశంలో సభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న తుది నిర్ణయం అనంతరం సోమవారం ఈ ప్రకటన వెలువడింది. వెయిట్ లిఫ్టింగ్‌లో నార్త్ కొరియా క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఇండియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గతంలో నార్త్ కొరియా లిఫ్టర్ల కారణంగా పతకాలు కోల్పోయింది. తాజా నిర్ణయంతో ఆమెకు కలసి వచ్చే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed