- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పైసలు ఇస్తావా.. చస్తావా..?
by Sumithra |

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలో ఓ రియల్ వ్యాపారిని బెదిరించిన వ్యక్తి పై రూరల్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన ఎటుకూరి సుధాకర్ అనే వ్యక్తి ఈ నెల 29న రాత్రి రియల్ వ్యాపారి షేక్ ఖలీల్‌కు ఫొన్ చేసి బెదిరించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అంతేకాకుండా చంపుతామని బెదిరించాడు. విషయాన్ని సెటిల్ చేసుకోకపోతే నీ వ్యాపారాన్ని నష్టం చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ అనంతరం నిందితుడిపై నాన్ బెయిల్ బుల్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ రావు తెలిపారు.
Next Story