- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హఫీజ్ సయీద్‌కు ఢిల్లీ కోర్టు అరెస్ట్ వారెంట్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తాయిబా చీఫ్, 26/11 ముంబయి దాడి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌కు ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణకు సంబంధించిన కేసులో స్పెషల్ జడ్జీ ప్రవీణ్ సింగ్ ఈ వారెంట్ జారీ చేశారు. హఫీజ్ సయీద్‌తోపాటు మరో ముగ్గురు జహూర్ అహ్మద్ షా వతాలి, అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫంతూష్, కిశోర్ కపూర్‌లకూ అరెస్టు వారెంట్ జారీ చేశారు.
కానీ, ఈ ముగ్గురూ ఇతర కేసుల్లో ఢిల్లీలోని తిహార్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈ అరెస్టు వారెంట్ జారీ అయింది. పాకిస్తానీ ఏజెన్సీలు హవాలా ద్వారా కొంతమంది ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి నిధులను సమకూర్చారని, ఇందులో నిందితుడి హస్తమున్నదని చార్జిషీటు పేర్కొంది.
Next Story