- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం రేవంత్ రెడ్డి పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్

దిశ,కడ్తాల్: శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కడ్తాల్ సీఐ సిహెచ్ గంగాధర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసత్య చేసిన వ్యక్తిని కడ్తాల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ఫేస్ బుక్ లో మండల కేంద్రానికి చెందిన జంబుల పాండురంగా రెడ్డి (రంగయ్య) 56 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతూ, పార్టీలకు పార్టీలకు మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులను పెడుతున్నాడని పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా, అసత్య ప్రచారాలను పోస్ట్ చేసిన ఏదైనా విషయంలో పూర్తి అవగాహన ఉంటేనే తప్ప అనవసర విషయాలను షేర్ చేస్తూ అవతలి వాళ్లకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కడ్తాల్ సీఐ సిహెచ్ గంగాధర్ హెచ్చరించారు.