- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరు జెడ్పీ.. ప్రమోషన్లొచ్చినా కదలట్లే
దిశ, మమబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌లో ఉద్యోగులు కొందరు తమ పరపతిని ఉపయోగించి సుధీర్ఘ కాలంగా తిష్టవేశారు. పైరవీలు చేస్తూ అనుకున్న సెక్షన్లో అనుకున్న పొస్టులో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ రొనల్డ్‌రోస్ నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కొందరిని బదిలీ చేశారు. ఇలా బదిలీపై వెళ్లి అలా వచ్చి మళ్లీ పాలమూరు జిల్లా పరిషత్లోనే విధులు నిర్వహిస్తున్నారు. మరి కొందరు ఉద్యోగ సంఘం నేతలుగా చలామణీ అవుతూ విధులు గైర్హాజరవుతున్నారు.
జిల్లాపరిషత్‌లో కొంతమంది ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతుల పంచాయితీ నడుస్తున్నది. ఈ విషయంపై పరిషత్ ఉద్యోగుల సంఘం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అక్రమ పద్ధతిలో పదొన్నతులు పొందినట్లుగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. జడ్పీలోనే తిష్టవేసిన సదరు ఉద్యోగులు విజిలెన్స్ విచారణ పక్కదారి పట్టించి నకిలీ సర్టిఫికెట్లకు ఒక ఇనిస్ట్యూట్‌ను సృష్టించి వారి పదోన్నతులకు చట్టబద్దత కల్పించుకున్నట్లు ఉద్యోగులు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు పలుమార్లు జడ్పీకి వచ్చి రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పదొన్నతులు పొందిన వారి పదొన్నతులు రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధం అవుతుండగా జడ్పీలో పాగా వేసిన అధికారులు ఈ పక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
చైర్మన్ ఎవరైనా సీసీలు వారే
జిల్లాపరిషత్ చైర్మన్ ఎవరు ఉన్నా సీసీలుగా మాత్రం గతంలో ఉన్నవారే కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో టీడీపీ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి మొదలకుని నేటి చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి వరకు ఒకే వ్యక్తి సీసీగా ఉన్నారు. జడ్పీసీఈవో సీసీగా కుడా సుదీర్ఘకాలంగా ఒకే వ్యక్తి పని చేయడం గమనార్హం.
వారిని ప్రసన్నం చేసుకుంటేనే..
జిల్లాపరిషత్ పరిధిలో పాఠశాలు, మండల పరిషత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలు, పదొన్నతులు పొందాలంటే ముందుగా తిష్ట వేసిన ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు అనుకుంటే అర్హత లేకున్నా అందలం ఎక్కిస్తారు. వారు కాదంటే అర్హత ఉన్నా పదోన్నతి రాదు. జిల్లాపరిషత్‌లో ఏ పని కావలన్నా వారిని సంప్రదించాల్సిందే. చివరకు జడ్పీటీసీలు సైతం పనుల కోసం వారిని సంప్రదిస్తున్నారంటే వారి హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పనులు కుడా వారు ఎక్కడ చెబితే అక్కడ చేయాల్సిందే. జనరల్ బాడీ సమావేశాలు, స్థాయీసంఘాల సమావేశాలు కుడా వారి కనుసన్నులలోనే కొనసాగుతాయి. వారు చేర్చిన అంశాలే ఎజెండాలోకి వస్తాయి. లేదంటే రావు. చివరకు సభ్యులు అడిగిన ప్రశ్నలు సైతం వారికి మినిట్స్ లో పొందుపర్చరు.
పదోన్నతులు వచ్చినా వదలరు..
కొంతమంది అధికారులకు ఇటీవలి కాలంలో సూపరింటెండెంట్లుగా పదోన్నతులు వచ్చాయి. మండలాలకు వెళ్లాల్సి వస్తుందని వారు పదోన్నతులు పొందకుండా ఇక్కడే తిష్టవేసుకుని ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జ్యోక్యం చేసుకుని వారిని జడ్పీ నుండి బదిలీ చేయాలని పరిషత్ ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
దశల వారీగా బదిలీ చేస్తాం: జడ్పీ సీఈఓ యాదయ్య
జెడ్పిలో కొంతమంది ఉద్యోగులు దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని దశల వారీగా ఇతర ప్రాంతాలకు బదలీ చేస్తాం.