ఈ- వాహనాలకు నో రిజిస్ట్రేషన్ ఫీ.. రోడ్ ట్యాక్స్!

by Shyam |
e-vehicles
X

దిశ, డైనమిక్ బ్యూరో: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వాహనాల నుంచి వెలుబడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ర్టిక్ వెహికిల్స్‌ను వాడే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తోంది. అయితే పెరుగుతున్న చమురు ధరలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మరిన్ని ఈ-వాహనాలను పెంచే విధంగా ప్రభుత్వం ఆఫర్లు ఇస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజును.. రోడ్డు ట్యాక్స్ ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.

అయితే దీనిపై టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. ‘‘పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 కింద రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌, బ్యాటరీ (ఈవీ) వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్‌ ట్యాక్స్‌ పూర్తిగా మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జోరందుకున్న ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు’’ అని ట్వీట్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో 4,568 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం జరిగినట్లు.. వారికి రూ.20 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఈ ట్వీట్‌కి స్పందించిన నెటిజన్లు ‘‘ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్‌ ట్యాక్స్‌ పూర్తిగా మాఫీ చేయడం మంచి విషయం కానీ వాటికి అవసరమైన charging station లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల electric వాహనాలు తీసుకున్న వారికి స్యౌలభ్యం ఉంటుంది. జనాల్లో అవగాహన ఉంటుంది.’’ అని రీ ట్వీట్లు చేస్తున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed