వైద్య సేవలకు ఆటంకం లేదు: సీపీ జోయల్ డేవిస్

by Shyam |
వైద్య సేవలకు ఆటంకం లేదు: సీపీ జోయల్ డేవిస్
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్ డాక్టర్లతో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా లౌక్ డౌన్, కర్ఫ్యూ సమయంలో వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్లు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సీపీ వైద్యులకు పలు సూచనలు చేశారు. హస్పిటల్స్‌లో విధులు నిర్వహించే వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి సంబంధిత హస్పిటల్స్ యాజమాన్యం తప్పని సరిగా గుర్తింపు జారీచేయాలన్నారు. ఈ గుర్తింపు కార్డును ప్రతి ఒక్కరు విధిగా మెడలో ధరించాలాలని కమిషనర్ సూచించారు. అదే విధంగా హస్పిటల్స్‌కు సర్జికల్ మెటిరియల్స్, ఔషదాలను సరఫరా చేసే మెడికల్ డిస్టిబ్యూటర్లు సైతం వారి సిబ్బందిని తప్పని సరిగా గుర్తింపు కార్డులను ధరించాలన్నారు. కరోనా వ్యాధి నివారణ గురించి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కమిషనర్ జోయల్ డేవిస్ ఈ సందర్భంగా తెలిపారు.

tag: No interruption, medical services, CP Joel Davis, siddipet

Advertisement

Next Story

Most Viewed