- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ రంగం ఎన్ఎండీసీ డీమెర్జింగ్‌కి డైరెక్టర్ల బోర్డు ఆమోదం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సంస్థ డైరెక్టర్ల బోర్డు ఎన్ఎండీసీ లిమిటెడ్, ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌ల డీమెర్జింగ్ కోసం ఆమోదం తెలిపినట్టు మంగళవారం ప్రకటించింది. మంగళవారం జరిగిన సంస్థ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో వాటాదారులు కంపెనీల చట్టం 2013, సెక్షన్ 230,232, ఇతర నిబంధనలకు ఆమోదం తెలిపారని ఎన్ఎండీసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
డీమెర్జింగ్‌కి అనుగుణంగా ఎన్ఎండీసీ లిమిటెడ్ వద్ద ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ మొత్తం వాటా మూలధనం రద్దు చేయబడుతుంది. ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ కొత్త ఈక్విటీ షేర్లు ఎన్ఎండీసీ లిమిటెడ్‌లోని వాటాదారులందరికీ సమాన నిష్పత్తిలో జారీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత వాటాదారులు, రుణదాతల ఆమోదంతో సహా ఎన్ఎండీసీ డీమెర్జర్‌కు అవసరమైన, చట్టబద్ధమైన, నియంత్రణ ఆమోదానికి లోబడి ఉందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎండీసీ డీమెర్జర్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సంస్థ షేర్ విలువ 5 శాతానికి పైగా పెరిగి రూ. 174 కు పెరిగింది.