రేపు తీరం దాటనున్న ‘నివర్’

by Shamantha N |   ( Updated:2020-11-24 07:01:56.0  )
రేపు తీరం దాటనున్న ‘నివర్’
X

న్యూఢిల్లీ: బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు, పుదిచ్చేరి మధ్యలో బుధవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని హెచ్చరించింది. చెన్నై, పుదుచ్చేరితో సహా తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం చెన్నై నగరానికి ఆగ్నేయంగా 450 కి.మీ. తీరంలో తుపాన్ కేంద్రీకృతమైంది.

పుదుకొట్టల్, తాంజావుర్, నాగపట్నం, మయిలదుత్తురాయి, తిరువురు సహా ఏడు జిల్లాల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి బస్సుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5గంటలకు కరైకల్, మామల్లపురం మధ్యలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉన్నది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఎడపాడు పళనిసామి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

Advertisement

Next Story