బ్యాంకింగ్ రంగంలో విస్తరణ అవసరముంది

by Harish |
బ్యాంకింగ్ రంగంలో విస్తరణ అవసరముంది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపీ 8 శాతం కంటే తక్కువ ప్రతికూలత నమోదు చేస్తుందనే అంచనాల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత ఆర్థిక వృద్ధి కరోనాకు ముందు స్థాయికి చేరుకునే అవకాశముందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం చెప్పారు. అంతేకాకుండా, బ్యాంకింగ్ రంగం విస్తరించాలని అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి 7.5 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ‘2021-22 చివరి నాటికి కొవిడ్-19 ముందునాటి స్థాయిలకు ఆర్థిక వృద్ధిని సాధించాలని భావిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. తయారీ రంగం వేగంగా ఉండటమే దీనికి కారణం. అలాగే, మెరుగైన వినియోగదారుల డిమాండ్ వృద్ధికి తోడ్పడుతుందనే ఆశలున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ..బ్యాంకింగ్ రంగంలో మరింత విస్తరణ, పోటీ పెరుగుదల అవసరమన్నారు. ఎందుకంటే, జీడీపీ నిష్పత్తికి భారత ప్రైవేట్ అప్పుల మధ్య పరిమితి తక్కువగా ఉంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు జీడీపీ నిష్పత్తికి ప్రైవేట్ రుణం 100 శాతానికి మించి ఉందని పేర్కొన్నారు. కావున, ప్రైవేట్ రుణాలను పెంచాల్సిన అవసరముంది. ఇది జరగాలంటే బ్యాంకింగ్ రంగం విస్తరించాలని రాజీవ్ కుమార్ చెప్పారు.

Advertisement

Next Story