నితిన్ ‘చెక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Anukaran |
నితిన్ ‘చెక్’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చెక్’. ఇందులో నితిన్‌కు జంటగా బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. రకుల్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 19న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఆనంద ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘చెక్’ అని చెప్పారు. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశమని, ఆద్యంతం ఆసక్తికరంగా మూవీ ఉంటుందని తెలిపారు. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మూవీకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫర్.

Advertisement

Next Story