- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇళ్లు కూలి 9 మంది మృతి

X
దిశ, వెబ్డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి చాంద్రాయణగుట్టలోని గౌస్నగర్లో రెండు ఇళ్లు కూలిపోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఒకే ఇంట్లో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇంట్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలంలో ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.
Next Story