ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

by srinivas |
ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే ఎన్నికల ప్రచారంగానే భావిస్తామన్నారు. ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించకూడదని.. చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా తీసుకొని వెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు నేమ్‌బోర్డ్స్ ఉండొద్దని ఏపీ సీఎస్‌కు పంపిన లేఖలో నిమ్మగడ్డ వెల్లడించారు.

Advertisement

Next Story