హైదరాబాద్‌కు ఎన్జీటీ…ఎఫ్పుడంటే

దిశ వెబ్ డెస్క్: సచివాలయ కూల్చివేత ప్రదేశాన్ని ఎన్జీటీ నిపుణుల బృందం సందర్శించనుంది. సచివాలయ కూల్చివేత, పర్యవసానాలపై ఎన్జీటీలో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విచారణ జరిపి కమిటీ ఏర్పాటుకు ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయ కూల్చివేత ప్రదేశాన్ని ఎన్జీటీ సందర్శించనుంది. ఈ మేరకు తమ పర్యటన వివరాలను తెలియజేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం, పత్రాలు ఏవైనా ఉంటే తమకు సమర్పించవచ్చని లేఖలో పేర్కొంది.

Advertisement