- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసీని పరిశీలించిన జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మోనిట్రాకింగ్ కమిటీ మంగళవారం మూసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించింది. ఈమేరకు కమిటీ చైర్మన్ జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ అధికారులతో కలిసి నాగోల్‌లోని మూసీ నదిపై ఉన్న వంతెన సమీపంలోని దక్షిణ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. వీటిపై ఆయనకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ విశ్వజిత్ వివరించారు. అదే ప్రాంతంలో 18 అడుగుల వెడల్పు 2 కిలో మీటర్ల పొడవులో నిర్మిస్తున్న నడక బాట, సైకిలింగ్ లైన్ పనులను కూడా పరిశీలించారు.
నాగోల్‌లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడి పరిస్థితులను ఆయనకు వివరించారు . అనంతరం ఉత్తరం వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను బృందం పరిశీలించింది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఉప్పల్ భగాయత్‌లోని నర్సరీ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడినుండి ఛాదర్‌ఘాట్‌లోని లోయర్ బ్రిడ్జి ప్రాంతాన్ని, హై కోర్ట్ సమీపంలో జరుగుతున్న పనులను, బాపూఘాట్ దగ్గర పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మూసీ నది మురుగు నీటిని శుభ్రం చేయడానికి ఎస్టీపీలను త్వరగా ఏర్పాటు చేయాలని, నాగోల్ నుండి బాపు ఘాట్ వరకు దాదాపు 20 కిలో మీటర్ల పొడవునా మూసీలో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని పూడికను యంత్రాల ద్వారా తొలగిస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.