- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్: న్యూజీలాండ్ యావరేజ్ స్కోర్ 163/4
దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు వెళ్లే మార్గాలు మరింత క్లిష్టతరం అవుతున్నాయి. షార్జా స్టేడియం వేదికగా జరుగుతున్న నమీబియా-న్యూజీలాండ్ మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్ ఆడిన కివీస్ జట్టు 163 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నమిబీయాలో బౌలర్లు తొలుత కట్టడి చేసినా.. చివర్లో అనవసర పరుగులు సమర్పించుకున్నారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజీలాండ్ 163 పరుగులు చేసింది. ఓపెనర్లు మర్టిన్ గప్తిల్ (18), మిచేల్ (19), విలియమ్సన్ (28), కాన్వే (17) పరుగులు చేసి వెనుదిరిగారు. కానీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్‌లు ఫిలిప్స్ (39 నాటౌట్), జేమ్స్ నీషమ్ (35 నాటౌట్)గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో న్యూజీలాండ్ 163/4 స్కోరు నమోదు చేసింది.
ఇక చిన్న జట్టు అయినా నమీబియాకు.. న్యూజీలాండ్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యం కష్టమేనని కామెంటేటర్లు చెబుతున్నారు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో గనుక న్యూజీలాండ్ గెలిస్తే సెమీస్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓడిపోతే ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుని స్కాట్‌లాండ్‌పై భారీ తేడాతో గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.