- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 వేల ఏళ్ల నాటి మమ్మీ.. ‘డిజిటల్ అన్‌ర్యాప్’ చేసిన సైంటిస్ట్స్!
దిశ, ఫీచర్స్: ఒంటిపై అనేక ద్రావణాలు పూసి, బట్టలతో చుట్టిన తర్వాతే ‘మమ్మీ’లను శవపేటికల్లో భద్రపరుస్తారని తెలిసిందే. అయితే వేలాది ఏళ్లనాటి మమ్మీలు బయటపడినప్పుడు వాటిపై పరిశోధన చేయాలంటే అన్‌బాక్స్ చేయక తప్పదు. ఇదంతా శ్రమతో కూడిన వ్యవహారం కాగా సరైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే శతాబ్దాల చరిత్రలోనే తొలిసారి హై-టెక్ స్కానర్స్ ఉపయోగించిన శాస్త్రవేత్తలు.. డిజిటల్ పద్ధతులు, త్రీడీ ఇమేజరీ సాయంతో మమ్మీకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాల(మమ్మీఫికేషన్)ను కనుగొన్నారు.
1881లో కనుగొన్న ఈజిప్ట్ ప్రఖ్యాత ఫారో అమెన్‌హోటెప్ I మమ్మీ మృతదేహాన్ని బహిర్గతం చేసేందుకు పరిశోధకులు గతంలో నిరాకరించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం మాత్రం కొత్త కంప్యూటర్ టోపోగ్రఫీ (CT) స్కానింగ్ టెక్నాలజీ, 3డీ ఇమేజరీ సాయంతో మమ్మీ సమాధికి ఎలాంటి భంగం కలిగించకుండా ఫారో శరీరాన్ని స్కాన్ చేశారు. ఈజిప్టు శాస్త్రవేత్తలు ఫారో దేహంపై ఉన్న రంగు రాళ్లు, పూల దండలు సహా ఫారో రూపాన్ని, అతనితో పాతిపెట్టిన విలువైన ఆభరణాల గురించిన పూర్తి వివరాలను కనుగొన్నారు. ఫారో వయసు, ఆరోగ్య పరిస్థితి, ఏ వయసులో చనిపోయాడు వంటి విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే అతన్ని ఖననం చేసిన నాలుగు శతాబ్దాల తర్వాత(11వ శతాబ్దంలో) ఈ మమ్మీని ఎవరో విప్పినట్లు వారు గుర్తించారు. కైరో యూనివర్సిటీ రేడియాలజీ ప్రొఫెసర్ సహర్ సలీమ్, ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త జాహి హవాస్ ఈ పరిశోధనను లీడ్ చేయగా, ఈ అధ్యయన వివరాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్’లో ఇటీవలే ప్రచురించారు.
అమెన్‌హోటెప్ I మమ్మీని ఆధునిక కాలంలో ఎన్నడూ అన్‌రాప్ చేయలేదు. తొలిసారి ఎలాగైతే పాతిపెట్టారో ఇప్పటికీ అలానే ఉంది. ఈ మమ్మీని డిజిటల్‌గా డీకోడ్ చేయడం వల్ల సవివరంగా అధ్యయనం చేయవచ్చు. ఫారో మరణించినప్పుడు అతడి వయసు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చు. సుమారు 169 సెం.మీ పొడవున్న ఫారో.. పటిష్టమైన దంతాలు కలిగి ఉన్నాడు. 30 తాయెత్తులు, బంగారు పూసలతో కూడిన ఒక ప్రత్యేకమైన నడికట్టును ధరించాడు. శారీరకంగా అతడు తన తండ్రిని పోలిఉన్నట్లు అనిపిస్తోంది.
– సహర్ సలీమ్, రేడియాలజీ ప్రొఫెసర్