- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రంగాల్లో రేపటి నుంచే కీలక మార్పులు.. సామాన్యుడిపై పెను ప్రభావం
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్, ఆర్థిక, ఇతర రంగాలకు చెందిన పలు నిబంధనలు డిసెంబర్ 1, 2021 నుండి మారనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి రోజువారి జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం..!
పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్..
పదవీ విరమణ పొందిన వారు దేశంలోని ఏదైనా జీవన్ ప్రమాణ్ కేంద్రాలలో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. చివరి తేదీ నవంబర్ 30, 2021గా నిర్ణయించారు. ఈ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్ ఇంకా బతికే ఉన్నారని రుజువు చేస్తుంది. ఈ నిబంధన పాటించకపోతే, మీ పెన్షన్ రద్దు చేయబడుతుంది.
డిపాజిట్లపై వడ్డీ రేట్లు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్న ఖాతా బ్యాలెన్స్‌పై 10 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతా బ్యాలెన్స్‌పై 5 బేసిస్ పాయింట్లు 2.80%, 2.85% కి తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్
డిసెంబర్ 1, 2021 నుండి మొదలయ్యే EMI లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తోంది. లావాదేవీలను EMIలుగా మార్చడంపై SBI ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తుంది. SBI క్రెడిట్ కార్డ్‌లను నిర్వహించే SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (SBICPSL), EMI లావాదేవీల కోసం, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
LPG సిలిండర్ ధర
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు డిసెంబర్ 2021 నుండి మారుతాయని భావిస్తున్నారు. సాధారణంగా, LPG సిలిండర్‌ల ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తారు. అయితే, గత కొన్ని సందర్భాల్లో, 1-15 తేదీల మధ్య ధరలను సవరించారు.
14 ఏళ్ల తర్వాత పెరగనున్న అగ్గిపెట్టె ధరలు
ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా 14 సంవత్సరాల తర్వాత అగ్గిపెట్టె ధరలు పెరగనున్నాయి. అగ్గిపెట్టెల ధర డిసెంబరు 1, 2021 నుండి రూ.1 నుంచి రూ.2కి పెంచారు. అగ్గిపెట్టె ధరలు చివరిసారిగా 2007లో బాక్స్‌కు 50 పైసల నుండి రూ.1కి పెంచారు.