రిలయన్స్ ఖాతాలో మరో ఘనత 

by Harish |
రిలయన్స్ ఖాతాలో మరో ఘనత 
X

దిశ, వెబ్ డెస్క్: రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (reliance industries limited‌) ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోని 100 అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా ఈ సంస్థ అవతరించింది.

ఈ ఏడాదికి గానూ విడుదలైన ‘ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ కంపెనీల (fortune global 500 companies) జాబితాలో ఆర్‌ఐఎల్‌ 96వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 106వ స్థానంలో ఉండగా… ఈసారి ఏకంగా 10 స్థానాలు పైకి చేరింది. ఈ జాబితా టాప్‌-100లోని ఏకైక భారత కంపెనీ రిలయన్సే. అత్యుత్తమ ర్యాంకింగ్‌ కలిగిన భారత సంస్థ కూడా ఇదే కావడం విశేషం.

Advertisement

Next Story