- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ సైన్స్.. న్యూరో మార్కెటింగ్
దిశ, వెబ్‌డెస్క్ : న్యూరాన్ అంటే నాడీకణం, మార్కెటింగ్ అంటే ఉత్పత్తిని అమ్ముకునే విధానం. ఈ రెండింటికీ సంబంధం ఏంటని కంగారు పడొద్దు. మార్కెటింగ్‌లో భాగంగా ఏదైనా వస్తువును కొనడానికి ముందు మన మెదడులో కదిలే ఆలోచనలకు తగినట్లుగా నాడీకణాలు స్పందిస్తాయి. మీరు పైకి చెప్పేది అబద్ధమే కావొచ్చు, కానీ ఏదైనా ఉత్పత్తి విషయంలో అభిప్రాయం గురించి మాత్రం నాడీ కణాలు అబద్ధం చెప్పలేవు. ఇలా కొన్ని ఉత్పత్తుల ప్యాకేజింగ్, అమరిక, శబ్ధం, రుచి మొదలగు వాటిని చూసినపుడు నాడీకణాల్లో కలిగే స్పందనను మెడికల్ పరికరాలతో రికార్డు చేసి, ఆ నివేదికలను అధ్యయనం చేసి అందుకు తగినట్లుగా ఉత్పత్తుల ఆకారం, రూపును మార్చడమే ఈ న్యూరో మార్కెటింగ్.
ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. టీవీలో కంటే ఎక్కువ యాడ్‌లు స్మార్ట్‌ఫోన్‌లోనే వస్తున్నాయి. కంటెంట్ బిజినెస్ పెరగడంతో సోషల్ మీడియా అడ్వర్‌టైజ్‌మెంట్ పెరిగింది. అయితే పాత పద్ధతుల్లో అడ్వర్‌టైజ్‌మెంట్ చేస్తే ఉత్పత్తి అందరికీ రీచ్ అవడం లేదు. అందుకే సంస్థలు ఈ న్యూరో మార్కెటింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. దీని ద్వారా ముందుగా వినియోగదారులకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు తగినట్లుగా ప్రకటనలు డిజైన్ చేస్తున్నారు. గుండ్రని చిప్స్ ఆకారాన్ని చతురస్రాకారంగా మార్చడం, టెట్రాప్యాక్‌లో పానీయాలను నింపడం.. ఇలాంటి మార్పులన్నీ న్యూరో మార్కెటింగ్ కారణంగా చేసినవే. డిజిటల్ కంటెంట్ బిజినెస్‌లో భాగంగా ఎలాంటి వీడియోలను చూడటానికి వీక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు? వీడియోల్లో ఏయే రంగులు కనిపిస్తే ఆకర్షితులవుతున్నారు? లాంటివన్నీ న్యూరో మార్కెటింగ్ టెక్నిక్‌ల ద్వారా తెలుసుకుంటున్నారు.
ఈ టెక్నిక్‌లలో భాగంగా వివిధ వయస్సుల వారిని ర్యాండమ్‌గా ఎంచుకుని వారికి వివిధ రకాల ప్రకటనలు చూపిస్తూ, అవి చూస్తున్నపుడు వారి మెదడులో కలిగే స్పందనలను మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా రికార్డు చేసి, ఆయా గ్రాఫ్‌ల ఆధారంగా వినియోగదారుల నిర్ణయాన్ని అంచనా వేస్తున్నారు. వినియోగదారుని ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి న్యూరో మార్కెటింగ్‌కు మించినది మరొకటి లేదు. ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకున్న వినియోగదారునికి అందుకు తగిన ఉత్పత్తిని లేదా సర్వీస్‌ను అందించడంలో ఇది చాలా ఉపయోగపడుతోంది. 2002 నుంచి ఈ న్యూరో మార్కెటింగ్ అమల్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా అడ్వర్‌టైజ్‌మెంట్ బూమ్ కారణంగా ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తోంది.