నామాలగుండు రోడ్డు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా..!

by Shyam |
నామాలగుండు రోడ్డు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా..!
X

దిశ, సికింద్రాబాద్: సీతాఫల్​మండి డివిజన్​పరిధిలోని నామాలగుండులో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నెలలు గుడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు పాత పైపులైన్​తొలగించి నూతనంగా డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు వేస్తున్నారు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నామాల గుండు నుంచి ఫ్రైడే మార్కెట్​వరకు జరుగుతున్న పనులతో ప్రయాణికులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంత నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులను వేగవంతం పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు తవ్వి దాదాపు 40రోజులు దాటినా నేటికీ పూర్తి కాలేదు. అంతేకాకుండా జీహెచ్ ఎంసీ పనులతో పాటు జలమండలి సివరేజీ పైప్ లైన్ పనులు కూడా ఉండటంతో రోడ్డు పనులు ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామాలగుండు నుంచి ఫ్రైడే మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణ పనులతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాత రోడ్డు తవ్వే క్రమంలో పైపులైన్లు పగిలిపోయి మురుగు నీరు రోడ్లపైనే పొంగిపొర్లింది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు. మరో వైపు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ డ్రైనేజీ పైపులు, తాగు నీటి పైపులు వేసాకనే రోడ్డ నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు సూచించడంతో పనులు వేగంగా జరగడం లేదు. ప్రస్తుత జనాభా అవసరాలకు సరిపడేలా నూతన పైప్ లైన్లను జలమండలి అధికారలు వేస్తున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

మరో వైపు కాంట్రక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాసిరకం పైపులతో పనులు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఉప్పరి బస్తీవాసులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుంటే దుమ్ము దూళితో సతమతమవుతున్నాని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఉప్పరి బస్తీ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed