జగన్ ముఖ్యసలహాదారు నీలం సాహ్ని రాజీనామా

by srinivas |
neelam
X

దిశ, వెబ్ డెస్క్: సీఎ ముఖ్యసలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సైతం ఆమె రాజీనామాను ఆమోదించింది. ఏపీ సీఎస్‌గా పదవీవిరమణ చేసిన తర్వాత ఆమెను సీఎం జగన్ ముఖ్యసలహాదారుగా నియమించారు. అయితే ఈ పదవిలో సాహ్ని రెండేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్ మెుదటి వారంలో ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె తన ముఖ్యసలహాదారు పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story