- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ నాలుగో మృతదేహం లభ్యం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రోయ్యూరులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కృష్ణానది ఒడ్డున శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే ముగ్గురు మృతదేహాలను గుర్తించి తీశారు. తాజాగా మరో యువకుని మృతదేహం గుర్తించి బయటకు తీశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. కాగా నలుగురు యువకులు వేటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story