రియా బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సవాల్..?

by Sumithra |
రియా బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సవాల్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, దానిని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) తెలిపింది.

ఈ కేసులో చట్టపరమైన పలు ప్రశ్నలు అంతర్గతమై ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ తెలిపారు. డ్రగ్స్ కేసులో ఆరపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ లభిస్తే సాక్ష్యులను ప్రభావితం చేయొచ్చని, దాంతో కేసు పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story