- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్‌గా నవీన్ కుమార్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ జాయింట్ డైరెక్టర్‌గా సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వై.నవీన్ కుమార్ నియమితులయ్యారు. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సురేంద్రనాథ్ పదవీ విరమణ చేయడంతో దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా ఆ బాధ్యతలను డిప్యూటీ డైరెక్టర్-1గా ఉన్న బి. వెంకటేశ్వర్లు ఎఫ్ఏసీ పద్ధతిలో నిర్వహించారు. ఇప్పుడు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నవీన్‌కుమార్‌ను జాయింట్ డైరెక్టర్ (ఎన్ఫోర్స్మెంట్), లైసెన్సింగ్ కంట్రోలింగ్ అథారిటీ పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) నిర్వహించేలా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా ఒక సర్క్యులర్‌లో ఆదేశించారు. జాయింట్ డైరెక్టర్ ఎఫ్ఏసి బాధ్యతలను వెంటనే నవీన్ కుమార్‌కు అప్పగించాల్సిందిగా వెంకటేశ్వర్లుకు ఆమె ఆ సర్క్యులర్‌లో సూచించారు. నిర్వహణాపరమైన అవసరాల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు ఆమె తెలిపారు.