- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధం దిశగా ప్రపంచం.. భారత ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎంతటి సవాల్‌నైనా తిప్పికొట్టేందుకు వెనుకాడటం లేదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. భౌగోళిక, రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించే విషయంలో ప్రపంచ దేశాలు అస్సలు రాజీపడటం లేదని పేర్కొన్నారు. ‘‘అధునాతన యుద్ధ సాంకేతికత అనేది గతంలో ధనిక దేశాలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది’’ అని ఆయన చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన డిఫెన్స్ సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రసంగించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ను సాకారం చేసుకోవడం అత్యవసరమని ఆయన తెలిపారు. యుద్ధాల్లో రాజీలేకుండా శత్రుపక్షంతో తలపడాలంటే స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘‘ఆయుధాలు, ఆయుధ టెక్నాలజీ కోసం మనం విదేశాలపై ఆధారపడితే ఇబ్బందులే ఎదురవుతాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆయా దేశాలు ఇలాంటి చేదు అనుభవాలనే చవిచూశాయి. కీలకమైన రక్షణ రంగ టెక్నాలజీని పొందలేక ఉక్రెయిన్ అల్లాడిపోయింది. అందుకే రక్షణ రంగంలో భారత ఆకాంక్షలు నెరవేరాలంటే ఆత్మనిర్భరత తప్పనిసరి’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. సైబర్ యుద్ధాన్ని కూడా ఎదుర్కొనేలా దేశ సైనిక దళాలు సర్వసన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.