- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Goa: ఐ హేట్ గోవా.. బహుశా ఇంకోసారి రాకపోవచ్చు.. వైరల్ గా టూరిస్టు సోషల్ మీడియా పోస్టు

దిశ, నేషనల్ బ్యూరో: గోవాకు వెళ్లిన ఓ టూరిస్ట్ తనకు జరిగిన భయంకరమైన ఛేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ గా మారింది. ‘‘బహుశా ఇంకో సారి గోవాకు రాకపోవచ్చు..ఐ హేట్ గోవా’’ అని కామెంట్ చేశాడు. గోవాలో ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడుతూ, తనపై శారీరకంగా దాడి చేసిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన కారు విండ్ షీల్డ్, అద్దాలను పగలగొట్టినట్లు వెల్లడించాడు. చిన్న ట్రాఫిక్ వివాదం కారణం మడ్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో స్థానికులు తనను వేధించినట్లు వివరించాడు. అద్దెకు తీసుకున్న కారులో తన స్నేహితురాలిని గోవా ఎయిర్‌పోర్టులో దించి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని దాటి ముందుకు వెళ్లానని.. వారికెలాంటి నష్టం జరగలేదన్నాడు. అయినా ఆ వెహికిల్ లోని వారిద్దరూ వచ్చి తన కారుని అడ్డగించి కార్ విండో గ్లాస్ దించకుంటే పగలగొడతామని హెచ్చరించారన్నాడు. వారు చెప్పినట్లు చేయడంతో తనపై దాడి చేసినట్లు వెల్లడించారు. తాను రైలు ఎక్కడానికి కొద్దిసేపు ముందే ఇదంతా జరిగందని తెలిపారు. కొందరు స్థానికులు తనకు సాయం చేశారని.. ఈ గొడవ వల్ల తాను రైల్వే స్టేషన్ కి సమయానికి చేరుకోలేకపోయానని అన్నాడు. ఇది చాలా భయంకరమైన అనుభవమని.. అందుకే తాను గోవాను ద్వేషిస్తున్నాట్లు పోస్టు పెట్టాడు.
నెటిజన్ల స్పందన ఇదే..
ఇకపోతే, ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ప్రస్తుతం గోవాలో పరిస్థితులు మారిపోయాయని కామెంట్లు చేస్తున్నారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని మరికొందరు చెప్పారు. గోవాకు రావాలంటేనే భయపడిపోతున్నామని మరికొందరురు అంటున్నారు. టాక్సీల దగ్గర నుంచి ప్రతీ విషయంలో దోపిడీకి గురవుతున్నామనే ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పర్యాటకానికి కేరాఫ్‌గా ఉన్న గోవాలో ఇటీవల కాలంలో ఆదాయం పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే గోవాలకు అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గుతున్నట్లు డేటా సూచిస్తోంది.