- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మమ్మల్ని అవమానించేందుకే..
- అమృత్‌సర్‌లో దిగిన యూఎస్ మిలటరీ విమానం
- ఢిల్లీలో ఎందుకు దించలేదని ఆగ్రహం
- అందులో గుజరాతీయులే ఎక్కువ
- కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ వలసదారులతో నిండిన విమానాన్ని దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా అమృత్‌సర్‌లో ఎందుకు దించారు?. అమెరికాలో దేశ బహిష్కరణకు గురైన వారితో ఉన్న విమానాన్ని అమృత్‌సర్‌లో దింపడం ద్వారా పంజాబ్‌ను అవమానించారని జలంధర్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం పంజాబ్‌పై నెగెటివిటీని పెంచేలా, దేశ ప్రజలు మా రాష్ట్రంపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచడానికే యూఎస్ మిలటరీ విమానాన్ని ఇక్కడ దించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విమానాలు కావాలని పంజాబ్ డిమాండ్ చేస్తే.. ఆ విమానాలన్నింటినీ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కేటాయించారు. కానీ యూఎస్ డీపోర్టేషన్ ఫ్లైట్‌ను మాత్రం పంజాబ్‌కు తరలిస్తారని అన్నారు. ఆ విమానంలో గుజరాతీయులు, హర్యానా రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉన్నారని పర్గత్ సింగ్ ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంటూ అభివృద్ది విషయంలో ఆ రాష్ట్రాన్ని ఫేమస్ చేస్తారు. కానీ పంజాబ్ విషయంలో మాత్రం తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా కేంద్ర వ్యవహరిస్తుందని అన్నారు. గుజరాత్ మోడల్ అంత మంచిదే అయితే ఎందుకు అనేక మంది గుజరాతీయులు అక్రమంగా ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అమృత్‌సర్‌లో విమానం దిగడంపై పంజాబ్ సీఎం భగవంత్ మన్ ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు.