- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశ అభివృద్ధి కోసమే సమిష్టిగా పని చేస్తున్నాం..ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధికి ఎప్పటికీ అంతం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జార్ఖండ్‌లోని గుమ్లాలో వికాస్ భారతి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘పురోగతికి అంతం ఎప్పుడైనా ఉందా? మన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందని మనం గ్రహిస్తాం. ఒక మనిషి సూపర్‌మ్యాన్‌గా, ఆపై దేవ్‌గా, ఆపై భగవాన్‌గా మారాలని కోరుకుంటాడు’ అని చెప్పారు. ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. దేశ భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని తెలిపారు. దేశ అభివృద్ధి కోసమే సమిష్టిగా పని చేస్తున్నామని, దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఐక్యంగా కృషి చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ‘దేశంలో 33 కోట్ల మంది దేవుళ్లు, 3,800 భాషలకు పైగా మాట్లాడేవారు ఉన్నారు. ఆరాధించే విధానాల్లోనూ తేడాలున్నాయి. ఆహారపు అలవాట్లు కూడా భిన్నమైనవి. ఈ బేధాలు ఉన్నప్పటికీ మన ఆలోచన మాత్రం ఒక్కటే. ఇతర దేశాల్లో అది కనిపించదు’ అని వ్యాఖ్యానించారు.