- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Wayanad :కేరళ ప్రభుత్వం, కేంద్రానికి పీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ కీలక సూచన
దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్ జిల్లాలో కొండచరియల బీభత్సంతో అతలాకుతలమైన గ్రామాల కోసం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్’ (సీఎండీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేశారు. దీనికి విశేష స్పందన వస్తోంది. ఎంతోమంది ప్రముఖులు, ప్రజానీకం నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో అధికార సీపీఎం ఎమ్మెల్యే వీకే ప్రశాంత్ విరాళాల సేకరణకు ‘‘వట్టియూర్‌కావు స్టాండ్స్ విత్ వయనాడ్’’ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దాతల నుంచి చెరో రూ.100 సేకరిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం తిరువనంతపురంలోని ప్రధానమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీకేఏ నాయర్ నివాసంలో ప్రారంభించారు. ఈసందర్భంగా టీకేఏ నాయర్ మాట్లాడుతూ.. వయనాడ్‌లోని బాధిత ప్రజల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే ప్రశాంత్‌ను అభినందించారు. ‘‘కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విమర్శించుకునే టైం కాదు ఇది. రాజకీయాలను పక్కన పెట్టి తొలుత వయనాడ్ ప్రజలకు సాయం చేయాలి. ఆ తర్వాత కూర్చొని అటువంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలనేది ప్లాన్ చేయొచ్చు’’ అని ఆయన సూచించారు. ప్రజలు ముందుకొచ్చి సీఎండీఆర్ఎఫ్‌కు విరాళాలు ఇవ్వాలని కోరారు.