Kolkata: ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం

by S Gopi |
Kolkata: ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన విధ్వంసం సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నమేనని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 2,000-2,500 మంది గూండాలు అర్ధరాత్రి కాలేజీ క్యాంపస్‌లోకి ప్రవేశించి, వైద్యులను కొట్టి బెదిరించారని, ఇంత జరిగినా పోలీసులు మౌనంగా ఉన్నారని మజుందార్ అన్నారు. గురువారం జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన రాజధానిలో శాంతిభద్రతలను కాపాడలేకపోతే, అధికారంలో కొనసాగే హక్కు లేదు. శుక్రవారం తాను ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీకి వెళ్లి నిరసన తెలుపుతానని' అన్నారు. అంతకుముందు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీతో వామపక్షాలు కుమ్మక్కయ్యాయని, బెంగాల్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

Advertisement

Next Story