Chat GPT : చాట్ జీపీటీ వినియోగంపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-15 07:15:58.0  )
Chat GPT : చాట్ జీపీటీ వినియోగంపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చాట్ జీపీటీ (జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డు 10,12 తరగతి పరీక్షలలో చాట్ జీపీటీ ఉపయోగించడాన్ని నిషేధించింది.

బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న 10,12 బోర్డు పరీక్షలలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష హాల్‌లోకి మొబైల్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని స్పష్టం చేశారు.

ఈ మేరకు బోర్డు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు చాట్ జీపీటీని ఉపయోగించవద్దని హెచ్చరించింది. కాగా చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్ వేర్ టూల్. ఇది వెబ్ బ్రౌజర్‌కు అనుసంధానంగా పనిచేస్తుంది. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లపైనా పనిచేస్తుంది.

కనుక కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో బ్రౌజర్లపై దీని సేవలు పొందొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం మానవ మేధస్సుతో పోటీ పడుతోంది. రానున్న రోజుల్లో మానవులను మించిపోతుందేమో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఎస్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చగా మారింది.

అయితే చాట్ జీపీటీని నిషేధించిన వాటిలో సీబీఎస్ఈ మొదటి విద్యాసంస్థ కాదు. అంతకు ముందు ఫ్రాన్స్ సైన్సెస్ పోతో సహా అనేక విద్యాసంస్థలు దీన్ని నిషేధించారు. యూఎస్ మీడియా కథనాల ప్రకారం చాట్ జీపీటీని న్యూయార్క్ నగరంతో పాటు సీటెల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిషేధించబడింది.

Advertisement

Next Story

Most Viewed