భారత ప్రధాని మోడీని ఆటో గ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

by Mahesh |   ( Updated:2023-05-21 06:31:48.0  )
భారత ప్రధాని మోడీని ఆటో గ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోడీ.. జపాన్ లో జరిగిన జీ7 సమావేశంలో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ మోడీతో మాట్లాడుతూ.. మోడీ ఆటోగ్రాఫ్ అడిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే.. జో బైడెన్ మోడీతో.. "నువ్వు నాకు అసలైన సమస్య తెచ్చిపెడుతున్నావు. వచ్చే నెలలో వాషింగ్టన్‌లో నీకు విందు చేస్తాం. దేశంలోని ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నారు. నాకు టిక్కెట్లు అయిపోయాయి" అని జో బైడెన్ ప్రధాని మోడీతో చెప్పినట్లు తెలిసింది. కాగా అమెరికా అధ్యక్షుడు మోడీ ఆటోగ్రాఫ్ అడగడం తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read...

రూ.2,000 నోట్లను ప్రవేశ పెట్టడం ప్రధాని మోడీకి ఇష్టం లేదు: మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ

Advertisement

Next Story