సంక్షోభంలో యూఎస్, చైనా, జపాన్.. కొవిడ్ టైంలో అలా చేయడమే కారణం : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

by Vinod kumar |   ( Updated:2023-05-17 14:29:14.0  )
సంక్షోభంలో యూఎస్, చైనా, జపాన్.. కొవిడ్ టైంలో అలా చేయడమే కారణం : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
X

ముంబై: కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉచితాలను అందించేందుకు డబ్బు ఖర్చు చేసినందుకే అమెరికా, చైనా, జపాన్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర రంగాలను ప్రోత్సహించేందుకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో ముందు చూపుతో వ్యవహరించిందన్నారు. వివిధ పథకాల లబ్దిదారులతో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నడ్డా ప్రసంగించారు. ‘కోవిడ్-19 సమయంలో యూఎస్, చైనా, జపాన్ దేశాలు ఉచితాల కోసం డబ్బును ఖర్చు చేశాయి. అందుకే ఆ దేశాలు ఇప్పుడు ఆర్థి కంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

అయితే వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాలపై ఖర్చు చేసేందుకు మన దేశం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ముందు చూపుతో వ్యవహరించింది’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వంటి మంచి నాయకుడు మనకు ఉండటం ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపిస్తూ.. ఉద్ధవ థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమ పనులను నిలిపివేసిందని అన్నారు. అయితే ఇప్పడు ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తోందని మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ చీఫ్ చెప్పారు.

Also Read..

ప్రాంతీయ పార్టీల ‘వన్ టు వన్’ ఫార్ములా.. నితీష్ ప్రతిపాదనకు మమత ఓకే: జేడీ-యూ

Advertisement

Next Story