సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా

by S Gopi |
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) 2024, మే 26న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (సీఎస్ఈ)ని రీషెడ్యూల్ చేసింది. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టే యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫారెస్ట్ సర్వీస్ స్కీనింగ్ పరీక్షలను వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 16న నిర్వహించనున్నట్టు యూపీఎస్‌సీ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. సివిల్ సర్వీసెస్‌లో 1,056 ఉద్యోగాలకు, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 14న యూపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6నే దరఖాస్తుల కోసం గడువు కూడా ముగిసింది. మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు.

Advertisement

Next Story