‘ఉల్టా పానీ’ కింది నుంచి పైకి రివర్స్ నీటి ప్రవాహం.. ఎక్కడో తెలుసా?

by Ramesh N |
‘ఉల్టా పానీ’ కింది నుంచి పైకి రివర్స్ నీటి ప్రవాహం.. ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధరంగా ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి దిగువకు ప్రవహించడం అందరూ చూసుంటారు. కానీ ఓ ప్రాంతంలో అందుకు భిన్నంగా కింది నుండి నీరు పైకి రివర్స్‌లో ప్రవహిస్తుంది. ఈ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే.. చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లా మెయిన్‌పట్ సమీపంలోని ఓ ప్రాంతంలో నీటి ప్రవాహం కింద నుంచి మీదికి పారుతున్నది.

భూమి గురుత్వాకర్షణలో తేడా వలన ఇలా నీరు ప్రవహిస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ ఈ ప్రవాహనికి గల అసలు కారణం మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనిపెట్టలేక పోతున్నారు. అయితే ఈ ప్రదేశాన్ని మాత్రం మినీ కాశ్మీర్ అంటూ అక్కడి పిలుచుకుంటున్నారు. వాటర్ రివర్స్‌లో పైకి వెళ్లడం ఎక్కడ చూడకపోవడంతో ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో ఆ ప్రాంతం ‘ఉల్టా పానీ’ కొన్నేళ్లుగా టూరిస్ట్ స్పాట్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed