Ukraine: ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం

by vinod kumar |
Ukraine: ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు యూఎస్ అందజేసే సైనిక సాయాన్ని నిలిపివేశారు. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు వైట్ హౌస్ (white House) అధికారులు తెలిపారు. ఈ ఆర్డర్స్ వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ‘రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేయడంతో మూడేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై దృష్టి సారించారు. జెలెన్ స్కీ దీనికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేశారు’ అని పేర్కొన్నారు. అయితే సహాయాన్ని శాశ్వతంగా నిలిపివేయడం కాదని, ఇది ఒక విరామం మాత్రమేనని తెలిపారు. జెలెన్ స్కీ నిజంగా శాంతిని కోరుకుంటున్నారని ట్రంప్‌కు నమ్మకం కలిగే వరకు నిలిపివేసిన సహాయం పునరుద్ధరించబోమని స్పష్టం చేశారు. అంతేగాక గత అగ్రిమెంట్‌లో భాగంగా అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఇంకా చేరని సహాయం కూడా యూఎస్ ఆపివేసింది. కాగా, ట్రంప్ జెలెన్ స్కీ మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రష్యాకు లొంగిపోయేలా చేసేందుకే: ఉక్రెయిన్

తమకు సైనిక సాయం నిలిపివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్రంగా మండిపడింది. రష్యాకు లొంగిపోయేలా చేసేందుకు అమెరికా ప్రయతిస్తున్నట్టుగా ఉందని ఉక్రెయిన్ పార్లమెంటరీ విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒలెక్సాండర్ మెరెజ్కో అభివర్ణించారు. సైనిక సాయాన్ని ఆపివేయండం పుతిన్‌కు సాయం చేయడమేనని తెలిపారు. జెలెన్ స్కీపై ఒత్తికి తీసుకురావడానికి మాత్రమే ఈ డిసిషన్ తీసుకున్నాని పేర్కొన్నారు. ఈ నిర్ణయం1938లో జరిగిన మ్యూనిచ్ ఒప్పందం కంటే దారుణంగా ఉందని తెలిపారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ సైతం అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది.

కాగా, 2022 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఉక్రెయిన్‌కు మద్దతిస్తోంది. భారీగా సైనిక సాయాన్ని, అత్యాధునికి ఆయుధాలను అందజేస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 65.9 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది. వీటిలో క్షిపణులు, ల్యాండ్‌మైన్లు తదితర ఆయుధాలు ఉన్నాయి. అమెరికా అండతోనే ఉక్రెయిన్ ఇన్ని రోజులు రష్యాతో దీటుగా పోరాడింది. రష్యా దాడులను అడ్డుకోగలిగింది. ప్రస్తుతం సాయం నిలిచిపోవడంతో ఉక్రెయిన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Next Story