- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
UK: ఉక్రెయిన్ కు బ్రిటన్ సంపూర్ణ మద్దతు

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఫ్రాన్స్ సహా పలు దేశాలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఆ తర్వాత ఆ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత.. బ్రిటన్‌కు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి స్టార్మర్ హామీ భరోసానిచ్చింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ఆదివారం ఐరోపా దేశాధినేతలతో స్టార్మర్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యేందుకు జెలెన్ స్కీ లండన్ వెళ్లారు. శనివారం రాత్రి ప్రధాని నివాసానికి వచ్చారు. 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయనకు స్టార్మర్ కరచాలనంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిద్దరూ ద్వైపాక్షిచ చర్చలు జరిపారు. తనకు మద్దతుగా నిలిచినందుకు బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు, స్టార్మర్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
స్టార్మర్ ఏమన్నారంటే?
స్టార్మర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. శాశ్వత శాంతిన కాపాడటం తన ఉద్దేశమని ట్రంప్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పును ప్రకటించి ఉక్రెయన్, రష్యా యుద్ధాన్ని పక్కనపెట్టారన్నారు. ఉక్రెయిన్ లోని ఖనిజాలను వెలికితీసేందుకు ఒప్పందంపై సంతకం చేయడంపైనే ట్రంప్ దృష్టి సారించారన్నారు. అందుకే, ట్రంప్ ఆలోచనలపై యూరప్ సందేహంలో ఉందన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, భద్రతను నిర్ధారించి.. శాశ్వత శాంతిని ఏర్పాటుచేసేందుకు అందరం కలిసి ముందుకు రావాలన్నారు. ఉక్రెయిన్‌కు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేందుకు, యూరోపియన్ భద్రతను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇదని గుర్తుచేశారు. ఐరోపా దేశాధినేతలతో స్టార్మర్ ఏర్పాటుచేసిన సమావేశంలో ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, రొమేనియా దేశాల నాయకులు కూడా పాల్గొంటారు.