- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రిపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలు, లోక్ సభ రూల్ నెంబర్ 222 ప్రకారం ఆయన సభకు పచ్చి అబద్ధాలు చెప్పారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆక్షేపించారు. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ కింద చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించి సభను తప్పుదోవ పట్టించడంపై నిలదీశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని అనడం భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించినట్టేనని పేర్కొన్నారు.
స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మధ్య ఇంత చర్చ జరిగిన అంశంపై అబద్ధం చెప్పడాన్ని రాజ్యాంగ వ్యవస్థను తీవ్ర అవమానించినట్టు చూడాలని కోరారు. లోక్‌సభలో ఆయన స్పందన తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి రాత పూర్వకంగా ఇచ్చిన విషయాన్ని విస్మరించడం దారుణమన్నారు. గతంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 9.08 కంటే తగ్గకుండా గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాయడం నిజం కాదా? అని ఎంపీ నామా ప్రశ్నించారు.