- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పారాగ్లైడింగ్ చేస్తూ టూరిస్టు దుర్మరణం

- పైలెట్ కూడా మృతి
- గోవాలో మరో విషాదం
దిశ, నేషనల్ బ్యూరో:
పర్యాటక ప్రాంతం గోవాలో మరో విషాదం చోటు చేసుకుంది. పారా గ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి ఒక మహిళతో పాటు పారాగ్లైడ్ పైలెట్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పూణేకు చెందిన శివానీ దబాలే (27) అనే మహిళ గోవా పర్యటనకు వచ్చింది. శనివారం నార్త్ గోవాలోని కేరి ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేయాలని భావించింది. ఆమెతో పాటు నేపాల్‌కు చెందిన పారాగ్లైడింగ్ పైలెట్ సుమన్ నేపాలి (26) కూడా వెళ్లాడు. అయితే 100 అడుగుల ఎత్తులో వీరు పట్టుతప్పి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్‌కు ఉన్న కేబుల్ తెలిపోవడం వల్ల బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, చట్ట విరుద్దంగా పారా గ్లైడింగ్ నిర్వహిస్తుననట్లు పోలీసులు గుర్తించారు. సదరు కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై బీఎన్ఎస్ 2023 చట్టం 105 కింద కేసు నమోదు చేశారు.