- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ సారా తాగి ముగ్గురి మృతి, మరో 16 మంది పరిస్థితి విషమం
దిశ, వెబ్‌డెస్క్: కల్తీ సారా తాగి ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరకానం పరిసర ప్రాంతంలో శనివారం రోజున కొంతమంది సారా తాగి తిరిగి ఇంటికి వెళ్లాక ఆరుగురు అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు హాస్పటల్‌కు తరలించారు.
కొంత సమయం తర్వాత మిగతా వారు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించగా.. మరో 16 మంది ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. జిల్లా సూపరింటెండెంట్ ఎన్ శ్రీనాథ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read..