28 ఏళ్లనాటి గేదె కేసు.. 83 ఏళ్ల వృద్ధుడికి తాజాగా నోటీసులు

by Javid Pasha |   ( Updated:2023-06-29 11:02:23.0  )
28 ఏళ్లనాటి గేదె కేసు.. 83 ఏళ్ల వృద్ధుడికి తాజాగా నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: 28 ఏళ్ల కిందట యాక్సిడెంట్ లో ఓ గేదె మృతి చెందిన కేసులో ఓ వ్యక్తికి పోలీసులు నోటీసులు అందించారు. అయితే ఇప్పుడా వ్యక్తి 83 ఏళ్ల వృద్ధుడు కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బారాబంకికి చెందిన అచ్చన్ అనే వ్యక్తి రాష్ట్ర ట్రాన్స్ పోర్టు శాఖలో డ్రైవర్ గా పని చేసి 20 ఏళ్ల కిందట రిటైర్ అయ్యాడు. అయితే 1994లో అచ్చన్ సామాన్ వేసుకొని బరేలి వెళ్లి తిరిగి వస్తుండగా ఫరీదాపూర్ లో ఓ గేదె తన వాహనానికి అడ్డంగా వచ్చింది. సడెన్ గా గేదె అడ్డం రావడంతో వాహనం అదుపు తప్పి గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక డ్రైవర్ అచ్చన్ స్థానిక ఫరీదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అచ్చన్ కు బెయిల్ వచ్చింది. కేసు ప్రారంభంలో రెండు సార్లు కోర్టుకు హాజరయ్యాడు. అనంతరం మళ్లీ ఎప్పుడూ ఆ కేసుకు సంబంధించి ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ మళ్లీ 28 ఏళ్ల తర్వాత నోటీసులు రావడంతో వృద్ధాప్యంలో ఉన్న అచ్చన్ షాక్ తిన్నాడు. ఇక అచ్చన్ పరిస్థితిని చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆయనతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కానీ పోలీసులు.. కోర్టుకు హాజరుకాకుంటే అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు.

Advertisement

Next Story