River:రక్తంలా ప్రవహిస్తోన్న నది.. తీవ్ర భయాందోళనలో స్థానికులు

by Jakkula Mamatha |   ( Updated:2025-02-07 12:40:24.0  )
River:రక్తంలా ప్రవహిస్తోన్న నది.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని కొన్ని ఘటనలు ఆసక్తికరంగా(Interesting) ఉంటాయి. మరికొన్ని షాకింగ్(Shocking) ఘటనలు కూడా వెలుగు చూస్తాయి. కానీ ప్రస్తుతం అర్జెంటీనా(Argentina)లోని ఓ నదిని చూస్తే.. షాక్‌కి అండ్ ఆశ్చర్యనికి గురిచేస్తోంది. అయితే నరకంలో వైతరణి నది గురించి పురాణాల్లో వినే ఉంటారు. అందులో రక్తం ప్రవహిస్తుందని చదివాం. ప్రజెంట్ అర్జెంటీనాలోని సరండీ నదిని చూస్తే అదే గుర్తుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనా(Argentina)లోని సరండీ నది(Sarandi River) రక్తంలా ఎరుపెక్కి ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ నది బ్యూనస్ ఎయిర్స్(Buenos Aires) నగరంలోని ఎన్నో స్లమ్(Slum), ఇండస్ట్రీ(Industry) ఏరియాల నుంచి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి వచ్చే ప్రమాదకరమైన వ్యర్థాలు అన్ని నది(River)లో కలుస్తున్నాయి. దీంతో ఆ రివర్‌లో కాలుష్యం(Pollution) పెరిగి ఎర్రగా మారుతున్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. నది కాలుష్యానికి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ వింత ఘటన స్థానికులను, శాస్త్రవేత్తల(scientists)ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాలుష్యాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

Next Story

Most Viewed