Budget 2024: పార్లమెంట్‌లో బడ్జెట్‌‌పై కొనసాగుతున్న చర్చ

by Harish |   ( Updated:2024-07-25 06:06:39.0  )
Budget 2024: పార్లమెంట్‌లో బడ్జెట్‌‌పై కొనసాగుతున్న చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చ కొనసాగుతుంది. దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష ఎంపీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని, బడ్జెట్‌‌పై చర్చ జరిగేలా చూడాలని కోరారు. ఈ రోజు చర్చల్లో బీహార్‌లో ప్రముఖ సాగు పంట అయిన మఖానా ఉత్పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించాలని ఆర్జేడీ ఎంపీ ఏడీ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎయిరిండియా విమానాల రద్దు, జాప్యంపై అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, గత నెలలో 164 విమానాలను రద్దు చేసినట్లు లోక్‌సభలో తెలిపారు. 2024-25 జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను కూడా ప్రస్తావించనున్నారు. అలాగే, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి 2023-24 గ్రాంట్ల కోసం మంత్రిత్వ శాఖ చేసిన డిమాండ్లపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక సిఫార్సుల అమలు స్థితిని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు బుధవారం కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఇది సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించడానికి కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని, ఇది వివక్ష బడ్జెట్ అని విమర్శించగా, కేంద్రం మాత్రం మధ్యతరగతి సాధికారతని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాలకు న్యాయం చేశామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed