- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సభలో సెక్స్ గురించి ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: శృంగారంపై బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సెక్స్ ఎడ్యూకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు బాగా అవగాహన పెరిగింది. ఏ టైమ్‌లో ఏం చేయాలో కూడా వారికి బాగా తెలుసు. అందుకే జనాభా తగ్గుతోంది.’ అని సీఎం అసెంబ్లీ వేదికగా అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలోని మహిళలంతా షాక్ అయ్యారు. మరోవైపు మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న చట్ట సభలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని బీజేపీ సభ్యులు సీరియస్ అవుతున్నారు. కాగా, అంతకుమందు.. సభలో సంచలన తీర్మానం చేశారు. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ సభ తీర్మానించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఉండగా.. తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం రిజర్వేషన్ 75శాతానికి పెరిగింది.