మందుబాబులకు బిగ్ షాక్.. ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్

by Jakkula Mamatha |
మందుబాబులకు బిగ్ షాక్.. ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్
X

దిశ,వెబ్‌డెస్క్: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం(Government) బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలు(Major Shrines) కలిగిన 17 పట్టణాల్లో మద్యం(alcohol) దుకాణాలను మూసి వేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నేడు(శుక్రవారం) ఖర్‌గోన్​లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్(CM Mohan Yadav) వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రధాన పుణ్య క్షేత్రాలున్న 17 పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసేస్తామని తెలిపారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రసక్తే లేదన్నారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూత పడతాయన్నారు. అలాగే నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు బంద్ అవుతాయని సీఎం తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించేందుకు తాము చేసిన సంకల్పం దిశగా ఈ నిర్ణయాన్ని తొలి అడుగుగా సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు.

Next Story

Most Viewed