Eknath Shinde: సీఎం ఎవరనేది త్వరలోనే తెలుస్తోంది: ఏక్ నాథ్ షిండే

by Shamantha N |
Eknath Shinde: సీఎం ఎవరనేది త్వరలోనే తెలుస్తోంది: ఏక్ నాథ్ షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly elections) మహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తోంది. కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra Chief Ministe) ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ఆ రాష్ట్ర మహిళలు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు 'లాడ్లీ బహిన్ యోజన'తో సహా తన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని పేర్కొన్నారు. తమ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమే కూటమి విజయానికి కారణమని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు."ఇది అఖండ విజయం. మహాయుతికి ఘన విజయం సాధిస్తుందని ముందే చెప్పాను. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మహాయుతి పార్టీల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు" అని ఆయన అన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపైనా షిండే స్పందించారు. "అంతిమ ఫలితాలు రావనివ్వండి .. మేం ఎన్నికల్లో కలిసి పోరాడిన విధంగానే.. మూడు పార్టీలు కలిసి సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాయి." అని షిండే చెప్పుకొచ్చారు.

గెలుపు దిశగా మహాయుతి

ఇకపోతే, 288 సభ్యుల అసెంబ్లీలో మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్‌ 101, శివసేన (Uddhav) 95, ఎన్సీపీ (SP) 86 సీట్లలో బరిలో దిగగా.. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మహారాష్ట్రలో 35 స్థానాల్లో మహాయుతి గెలవగా.. 185 స్థానాల్లో ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడీ 6 స్థానాల్లో గెలవగా.. 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed