రాజౌరీ- పూంచ్ సెక్టార్‌లో ఉద్రిక్త పరిస్థితి: ఆర్మీ చీఫ్ జనల్ మనోజ్ పాండే

by samatah |
రాజౌరీ- పూంచ్ సెక్టార్‌లో ఉద్రిక్త పరిస్థితి: ఆర్మీ చీఫ్ జనల్ మనోజ్ పాండే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండో-మయన్మార్ బార్డర్, జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ-పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత చర్యలకు సహాయం చేయడంలో భారత శత్రువులు క్రియా శీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇక్కడి పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఆర్మీ డేకి ముందు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తుందని చెప్పారు. ‘ఇటీవల రాజౌరీ, పూంచ్‌లలో ఉగ్రవాదం పెరిగింది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఆ ప్రాంతంలో 2017 వరకు శాంతి నెలకొంది. కానీ ఇప్పుడు,మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది’ అని చెప్పారు. ఎల్ఓసీ వెంబడి చొరబాటు ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతాల్లో 35 మందికి పైగా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. మణిపూర్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 20 అసోం రైఫిల్ బెటాలియన్లు ఇండో-మయన్మార్ సరిహద్దులో మోహరించినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed